1975 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము. 2023 నూతన సంవత్సరం ఆదివారంతో ప్రారంభం అవుతుంది. 2023 అనేది 3వ సహస్రాబ్ది, 21వ శతాబ్దపు 23వ సంవత్సరం. 2020 దశాబ్దపు సంవత్సరం.

సంఘటనలు

  • జనవరి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మహబూబాబాద్,[1] కొత్తగూడెం[2] పట్టణాలలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయాలు ప్రారంభించబడ్డాయి.
  • జనవరి 25: 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలు ప్రకటించబడ్డాయి.[3]
  • ఫిబ్రవరి 1: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[4]
  • ఫిబ్రవరి 3: తెలంగాణ శాసనసభ బడ్జెట్ (2023-24) సమావేశాలు ప్రారంభమై, ఫిబ్రవరి 12 వరకు కొనసాగాయి.
  • ఫిబ్రవరి 6: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[5][6]
  • ఫిబ్రవరి 6 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 41,000 మందికి పైగా మరణించారు. 120,000 మందికిపైగా గాయపడ్డారు.[7][8]
  • ఫిబ్రవరి 9: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌, లుంబినీ పార్క్‌ సమీపంలో ప్రారంభించబడింది.[9]
  • ఫిబ్రవరి 11: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.[10]
  • ఫిబ్రవరి 15: కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి చేయడంకోసం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.[11][12]
  • ఫిబ్రవరి 24: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో బయో ఏషియా సదస్సు-2023 ప్రారంభమై, ఫిబ్రవరి 26న ముగిసింది.[13][14]
  • ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.
  • ఏప్రిల్ 30: హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు.
  • మే 10: కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు ప్రకటించగా, 224 నియోజకవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 136 చోట్ల గెలుపొందింది. మే 20న కర్నాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశాడు.
  • జూన్ 2: ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 294 మంది మరణించారు. 1,175 మంది గాయపడ్డారు.[15]
  • జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడి, జూన్ 22న ముగిసాయి.
  • జూన్ 4: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిర్మల్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నాగర్‌కర్నూల్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 6: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర: రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సన్ ప్రాంతంలోని నోవా కఖోవ్కా ఆనకట్ట ధ్వంసమైంది, ఈ ప్రాంతాన్ని వినాశకరమైన వరదలతో ముప్పుతిప్పలు పెట్టింది.
  • జూన్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మంచిర్యాల పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 11: మార్చిలో తైవాన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత హోండురాస్ తన మొదటి రాయబార కార్యాలయాన్ని చైనాలోని బీజింగ్‌లో ప్రారంభించింది.
  • జూన్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా గద్వాల పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 13: నైజీరియాలోని క్వారా స్టేట్‌లోని నైజర్ నదిపై పెళ్లి పడవ బోల్తా పడడంతో కనీసం 106 మంది మరణించారు.
  • జూన్ 14: స్పెర్మ్ లేదా గుడ్డు కణాల అవసరం లేకుండా స్టెమ్ సెల్స్ నుండి మొదటి కృత్రిమ మానవ పిండాన్ని సృష్టించినట్లు శాస్త్రవేత్తలు నివేదించారు.
  • జూన్ 14: పెలోపొన్నీస్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 82 మంది మరణించారు, 500 గల్లంతయ్యారు.
  • జూన్ 16: ఉగాండాలో, జిహాదిస్ట్ గ్రూప్ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మ్పాండ్వేలోని ఒక పాఠశాలలో 42 మందిని చంపింది.
  • జూన్ 18: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడు: టైటానిక్ శిథిలాలను అన్వేషిస్తున్న లోతైన సముద్ర జలాంతర్గామి అయిన టైటాన్‌లోని ఐదుగురు సిబ్బంది, ఓడ విపత్తు పేలుడు కారణంగా మరణించారు.
  • జూన్ 20: హోండురాస్‌లోని తెగుసిగల్పా సమీపంలోని మహిళా జైలులో MS-13, బార్రియో 18 ముఠా సభ్యుల మధ్య జరిగిన అల్లర్లలో కనీసం 46 మంది మరణించారు.
  • జూన్ 21: అట్లాంటిక్‌లోని స్పానిష్ కానరీ దీవుల తీరంలో వలస డింగీ మునిగిపోవడంతో కనీసం 35 మంది మరణించారు.
  • జూన్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.
  • జూన్ 23: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: యెవ్జెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నెర్ గ్రూప్, రష్యా సైన్యంతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించిన శాంతి ఒప్పందం తర్వాత, మరుసటి రోజు ఉపసంహరించుకునే ముందు రోస్టోవ్-ఆన్-డాన్ నగరాన్ని, వొరోనెజ్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది.
  • జూన్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆసిఫాబాద్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూలై 20: 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 1గ్లోబల్ వార్మింగ్: ప్రపంచ మహాసముద్రాలు 2016లో మునుపటి రికార్డును అధిగమించి 20.96 °C యొక్క కొత్త రికార్డు అత్యధిక ఉష్ణోగ్రతను చేరుకున్నాయి. జూలై కూడా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు గణనీయమైన మార్జిన్‌తో నమోదు చేయబడిన అత్యంత వేడి నెలగా నిర్ధారించబడింది ( 0.3 °C).[16][17][18]
  • ఆగస్టు 4: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై, ఆగస్టు 6న ముగిసాయి.
  • ఆగస్టు 20: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సూర్యాపేట పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.[19]
  • ఆగస్టు 23: భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.[20]
  • ఆగస్టు 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మెదక్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.[21]
  • డిసెంబరు: తెలంగాణ శాసనసభ ఎన్నికలు

మరణాలు

మూలాలు

  1. hansindia (2023-01-12). "KCR at inaugurating the new Collectorate building complex of Mahabubabad Photo Gallery". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.
  2. "kcr inaugurates kothagudem collectorate office". Vaartha. 2023-01-12. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.
  3. "Padma awards2023: చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌.. కీరవాణికి పద్మశ్రీ". EENADU. 2023-01-25. Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-25.
  4. "Budget-2023: బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ". web.archive.org. 2023-02-01. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ." EENADU. 2023-02-06. Archived from the original on 2023-02-06. Retrieved 2023-02-08.
  6. "Telangana Budget 2023: దేశానికే నమూనా". EENADU. 2023-02-07. Archived from the original on 2023-02-07. Retrieved 2023-02-08.
  7. "Earthquake Kills More Than 110 People in Turkey, Syria". Bloomberg.com (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
  8. "Powerful quake kills at least 360 people in Turkey, Syria". AP NEWS (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
  9. "Funday returns with double deckers & musical fountains in Hyderabad". The Times of India. 2023-02-20. ISSN 0971-8257. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-25.
  10. telugu, NT News (2023-02-11). "Formula E | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు". www.ntnews.com. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2023-02-12 suggested (help)
  11. "దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు". EENADU. 2023-02-16. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-25.
  12. telugu, NT News (2023-02-15). "కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-25.
  13. India, The Hans (2023-02-24). "Minister KTR opens 20th Edition of BioAsia in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.
  14. "Bio Asia: హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు". EENADU. 2023-02-24. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-25.
  15. Abinaya V; Jatindra Dash (2 June 2023). "At least 207 dead, 900 injured in massive train crash in Odisha, India". Reuters. Retrieved 2 June 2023.
  16. "Ocean heat record broken, with grim implications for the planet". BBC News. 4 August 2023. Retrieved 4 August 2023.
  17. "These places baked the most during Earth's hottest month on record". The Washington Post. 2 August 2023. Retrieved 4 August 2023.
  18. "July 2023 is set to be the hottest month on record". World Meteorological Organization. 31 July 2023. Archived from the original on 2 ఆగస్టు 2023. Retrieved 5 August 2023.
  19. Velugu, V6 (2023-08-20). "సూర్యాపేటలో కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  20. "India makes history as Chandrayaan-3 lands near Moon's south pole". BBC News. 23 August 2023. Retrieved 23 August 2023.
  21. telugu, NT News (2023-08-23). "CM KCR | మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.