జనపనార
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Jute fiber is being dehydrated after retting alongside a road
Jute Rope

జనపనార (Jute) మెత్తని, మెరిసే పొడవైన నార. వీటిని బలమైన దారాలు, తాడుగా అల్లుకోడానికి వీలుంటుంది. ఇవి సన్నని పొడవైన మొక్కల ప్రజాతి కార్కొరస్ (Corchorus) నుండి లభిస్తుంది. దీనిని టీలియేసి (Tiliaceae) లేదా మాల్వేసి (Malvaceae) కుటుంబంలో వర్గీకరించారు.

జనపనార లక్షణాలు

జనపనార అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతిసిద్ధమైన నార. ఇది ప్రత్తి తర్వాత స్థానంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది. ఈ నారలో ముఖ్యంగా సెల్యులోజ్ (Cellulose), లిగ్నిన్ (Lignin) లు ఉన్నాయి. దీని పారిశ్రామిక నామం : raw jute. నారపోగులు తెలుపు నుండి లేత గోధుమ రంగులో సుమారు 1–4 మీటర్లు పొడుగు ఉంటాయి.

సాగుచేయు విధానం

జనపనార రేగడి నేలల్లోను, నీరునిలబడే తడినేలల్లో పెరుగుతుంది. వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం దీనికి సాగుకు అనుకూలమైంది. ఈ రెండూ ఋతుపవనాలు అందించే ఉష్ణమండలంలో కనిపిస్తుంది. దీనికి 20˚C నుండి 27˚C ఉష్ణోగ్రత, 70%–80% గాలిలో తేమ అవసరం. వారానికి 5–8 cm వర్షపాతం ముఖ్యంగా నాటడానికి కావాలి.

చరిత్ర

జనపనార కొన్ని శతాబ్దాలుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లకు చెందిన బెంగాల్ సంస్కృతి లో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 19, 20 వ శతాబ్దాలలో ముడి జనపనారను యునైటెడ్ కింగ్ డం కు తరళించేవారు. అక్కడి మిల్లులలో దాన్ని శుభ్రపరచి నారను తయారుచేసేవారు. తర్వాత కాలంలో దీని కోసం యంత్రాలను ఉపయోగించారు.[1] 1901 UK జనాభా లెక్కలలో జనపనార మిల్లులలో పని ఒక గుర్తించబడిన వృత్తి. అయితే 1970 తర్వాత కృత్రిమ నారల ఉత్పత్తి మొదలై వీటి ప్రాముఖ్యత తగ్గిపోయింది.

జనపనార ఉత్పత్తి

జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి పది దేశాలు — 2024
దేశం ఉత్పత్తి (టన్నులు) పాదపీఠిక
 భారతదేశం 1,846,000 F
 Bangladesh 848,715 F
 People's Republic of China 48,000 F
 Burma 30,000 F
 Uzbekistan 20,000 F
 Nepal 16,988 F
 Vietnam 8,800 F
 Thailand 5,000 F
 Sudan 3,300 F
 Egypt 2,200 F
 {{{1}}}World 2833041 A
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official or estimates);

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division Archived 2012-06-19 at the Wayback Machine

ఉపయోగాలు

జనపనార చాలా రకాలుగా ఉపయోగపడుతున్నది.

  • జనపనారను తాళ్ళు గా అల్లి ఉపయోగిస్తారు.
  • దీనిని మందమైన వస్త్రంగా తయారుచేసి దానితో తెరలు, చాపలు, కంబళి, గోనె సంచులు, తివాచీ మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
  • నారతో చేసిన సంచుల్ని పోలిథీన్ సంచుల స్థానంలో ఉపయోగిస్తే మంచిది.
  • ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో జనపనార ఆకులను ఆహారంలో ఆకుకూరగా వాడుతారు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియమ్ లు అధికంగా ఉన్నాయి.

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.