1939 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
బాలు మహేంద్ర
జనవరి 1 : సత్యమూర్తి , వ్యంగ్య చిత్రకారుడు.
ఫిబ్రవరి 9 : బండి రాజన్ బాబు , పేరొందిన ఛాయాచిత్రకారుడు. (మ.2011)
ఫిబ్రవరి 21 : సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
ఫిబ్రవరి 22 : కలువకొలను సదానంద , బాల సాహిత్య రచయిత.
ఫిబ్రవరి 24 : జాయ్ ముఖర్జీ , భారతీయ చలనచిత్ర నటుడు.
మార్చి 3 : ఎం.ఎల్.జయసింహ , భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు.
మార్చి 31 : సయ్యద్ హుసేన్ బాషా , నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటక రచయిత . (మ.2008)
ఏప్రిల్ 7 : ఆడెపు చంద్రమౌళి , వరంగల్లు జిల్లాకు చెందిన కవి. (మ.2009)
ఏప్రిల్ 7 : రియాజ్ అహ్మద్ , మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023)
ఏప్రిల్ 13 : సీమస్ హీనీ , ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
ఏప్రిల్ 14 : గొల్లపూడి మారుతీరావు , రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. (మ.2019 )
ఏప్రిల్ 21 : భాను ప్రకాష్ , తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
ఏప్రిల్ 22 : శీలా వీర్రాజు , కవి, రచయిత, చిత్రకారుడు.
మే 20 : బాలు మహేంద్ర , దక్షిణ భారతీయ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (మ.2014)
జూన్ 2 : విష్ణు నారాయణ్ నంబూత్రి , మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
జూన్ 9 : డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (మ. 1973)
జూన్ 15 : దస్తగిరి అచ్చుకట్ల చిన్న , సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు.
జూన్ 19 : నూతలపాటి సాంబయ్య , నాటకరంగ ముఖ్యడు.
జూన్ 20 : రమాకాంత్ దేశాయ్ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (మ.1998)
జూన్ 22 : అడాయీ యోనత్ , ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
జూన్ 27 : బొజ్జా తారకం , హేతువాది. పౌరహక్కుల నేత. (మ.2016)
జూన్ 30 : సుంకర వెంకట ఆదినారాయణరావు , పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
జూలై 1 : కొలకలూరి ఇనాక్ , ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి
జూలై 2 : మల్లెల గురవయ్య , కవి. మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)
జూలై 3 : లకంసాని చక్రధరరావు , "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు
జూలై 10 : కేతు విశ్వనాథ రెడ్డి , సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. (మ. 2023)
జూలై 30 : గోపరాజు సమరం , వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, ప్రముఖ రచయిత.
జూలై 31 : నండూరి పార్థసారథి , రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024)
ఆగష్టు 12 : సుశీల్ కొయిరాలా , నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)
ఆగస్టు 10 : చౌటి భాస్కర్ , ప్రముఖ సంగీత విద్యాంసులు (మ. 1990)
ఆగష్టు 17 : మోదడుగు విజయ్ గుప్తా , కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
సెప్టెంబర్ 23 : కందుల వరాహ నరసింహ శర్మ , రచయిత.
అక్టోబరు 1 : ఎల్కోటి ఎల్లారెడ్డి , మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
అక్టోబరు 23 : భగవాన్ , చిత్రకారుడు. (మ.2002)
అక్టోబరు 27 : చలసాని ప్రసాదరావు , రచయిత, చిత్రకారుడు. (మ.2002)
నవంబర్ 14 : ఆర్. విద్యాసాగర్‌రావు , నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. (మ.2017)
నవంబర్ 21 : హెలెన్ , బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.
డిసెంబర్ 15 : నూతలపాటి గంగాధరం , కవి, విమర్శకుడు. (మ.1975)
డిసెంబర్ 21 : సూరపనేని శ్రీధర్ , తెలుగు సినిమా నటుడు. (మ.2007)
[[]]: బాతిక్ బాలయ్య , తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (మ. 2020)
మరణాలు
ఫిబ్రవరి 18 : భాగ్యరెడ్డివర్మ , ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
మే 26 : రఘుపతి వేంకటరత్నం నాయుడు , విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
సెప్టెంబరు 23 : సిగ్మండ్ ఫ్రాయిడ్ , ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)
సెప్టెంబరు 27 : దాసు విష్ణు రావు , న్యాయవాది. (జ.1876)
అక్టోబర్ 1 : వెన్నెలకంటి సుబ్బారావు , ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
నవంబర్ 27 : చర్ల నారాయణ శాస్త్రి , సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881)
డిసెంబరు 3 : ఓలేటి వేంకటరామశాస్త్రి , జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
పురస్కారాలు
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు