Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.
బీహార్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
పాట్నా - 25°21′N 85°07′E / 25.35°N 85.12°E |
పెద్ద నగరం | పాట్నా |
జనాభా (2001) - జనసాంద్రత |
82,878,796 (3rd) - 880/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
94,164 చ.కి.మీ (12th) - 37 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[బీహార్ |గవర్నరు - [[బీహార్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1912 - ఫగు చౌహాన్ - నితీష్ కుమార్ - రెండు సభలు (243 + 96) |
అధికార బాష (లు) | హిందీ, అంగిక, భోజ్‌పురి, మగహి, మైథిలి |
పొడిపదం (ISO) | IN-BR |
వెబ్‌సైటు: gov.bih.nic.in |
బీహార్ (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రం. రాజధాని పాట్నా. బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశం సరిహద్దుగా ఉంది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది.
బీహారు చరిత్ర పురాతనమైంది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.
'విహారం' అనే సంస్కృతపదం నుండి 'బీహార్' పేరు రూపొందింది.
మతాలకు జన్మస్థానం
బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం. బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడు.
విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో మహమ్మదు ఘోరీ సైన్యం వశమైంది. మధ్యలో ససరాం నుండి వచ్చిన షేర్ షా సూరి ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. కలకత్తా నుండి పెషావర్ (పాకిస్తాన్) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.
1557-1576 మధ్యకాలంలో అక్బర్ చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని బెంగాల్ పాలనలో కలిపాడు. ముఘల్ సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ నవాబుల అధీనంలోకి వెళ్ళింది.
1765లో బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బీహార్, బెంగాల్, ఒడిషాలపై దివానీ (పన్ను) అధికారం లభించింది. అప్పటినుండి 1912 వరకు బీహార్ ప్రాంతం బ్రిటిష్‌వారి బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1912లో బీహార్‌ను వేరుచేశారు. 1935లో బీహారులో కొంతభాగాన్ని ఒడిషాగా ఏర్పరచారు. 2000లో బీహారులోని 18 జిల్లాలను వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.
1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంలో ససరాంకు చెందిన బాబు కున్వర్ సింగ్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని చంపారణ్ నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన బాబూ రాజేంద్రప్రసాద్ తరువాత మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి.
డిసెంబరు, జనవరి మాసాలు చలికాలం ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు సెల్సియస్ వరకు నమోదవుతాయి. వేసవికాలం ఏప్రిల్, మే లలో 40-45 డిగ్రీలవరకు వెళ్తుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం.
2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్థికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు.
భారతదేశంలో బాగా పేదరాష్ట్రాలలో ఒకటిగా బీహారు గుర్తింపబడుతుంది. దీనికి చాలా కారణాలు చెబుతారు. తక్కువ అక్షరాస్యత, కేంద్రం నిర్లక్ష్యత (ఇదివరకు కలకత్తా, ఇప్పుడు ఢిల్లీ), కులాలవారీగా, మతాలవారీగా చీలిపోయిన సమాజం, సంస్కరణలు రాకపోవడం, నాయకుల అవినీతి - ఇలాంటి చాలా కారణాలున్నాయి.
బీహారు శాసన, పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనె ఉంది. - గవర్నరు, ముఖ్య మంత్రి, శాసన సభ, సివిల్ సర్వీసు, న్యాయ వ్యవస్థ వగయిరా.
దాదాపు దశాబ్దం పైగా బీహారు రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ వచ్చాడు.
బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ
రైల్వే వ్వస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.
బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.
అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలు జరుపుకుంటారు.మకర సంక్రాంతి, దసరా, హోలీ, ఈద్-ఉద్-ఫిత్రా, బక్రీద్, ముహర్రం, శ్రీరామ నవమి, రథయాత్ర, రాఖీ, మహాశివరాత్రి, దీపావళి, లక్ష్మీపూజ, క్రిస్టమస్, మహావీర జయంతి, బుద్ధపూర్ణిమ, ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు
అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే ఛత్ లేదా దలాఛత్ పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది సూర్యుడిని ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి జానపద సంగీతం చాలా పురాతనమైనది. ఎంతో వైవిధ్యము కలిగినది. జీవనంలో అన్ని సందర్భాలకూ, ఉత్సవాలకూ ఆయా విశిష్ట బాణీలలో జానపద గేయాలున్నాయి. ఇంకా హాస్యాన్నీ, ఆనందాన్నీ కలగలిపిన హోలీ పాటలు కూడా చాలా ఉన్నాయి.
19వ శతాబ్దంలో బ్రిటిష్‌వారి దుష్పాలన వల్ల, క్షీణించిన ఆర్థిక గతివల్లా చాలామంది ఫిజీ, మారిషస్ వంటి పరదేశాలకు వలసపోయారు. అప్పటి చేదు పరిస్థితులకు అద్దం పట్టే విషాదపూరిత గేయాలూ, నాటికలూ కూడా చాలా జనప్రసిద్ధమైనాయి.
బీహారులో హిందీ, ఉర్దూ మాత్రమే కాకుండా మరెన్నో స్థానిక భాషలున్నాయి. భోజపురి, మైథిలి, మాగహి, ఆంగిక వంటివి. వీటిని కొంత వరకు హిందీ మాండలికాలని కూడా పరిగణిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కలిపి బీహారీ భాష అని కూడా వ్యవహరిస్తుంటారు.
బీహారు నండి ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు ఉన్నారు. రాజా రాధికా రమణ సింగ్, శివ పూజన్ సహాయ్, [[దివాకర ప్రసాద్ విద్యార్ధి]], నిరాలా, రామ్ బిక్ష్ బేనిపురి, దేవకీ నందన్ ఖత్రి (చంద్ర కాంత నవలా రచయిత), విద్యాపతి (మైథలి భాషా రచయిత) వంటి వారు.
బీహారులో భోజపురి భాష సినిమా పరిశ్రమ బాగా వేళ్ళూనుకొంది. కొద్దిపాటి మైధిలి సినిమా పరిశ్రమ కూడా ఉంది.
ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు.
విద్యా వ్యవస్థ తక్కిన భారతదేశంలో లానే ఉంది.
1980 దశకంలో చాలా ప్రైవేటు యాజమాన్పు స్కూళ్ళను ప్రభుత్వం అధినంలోకి తీసుకొన్నది. ఇవన్నీ బీహారు స్కూల్ ఎక్జామినేషను బోర్డు అధ్వర్యంలో నడుస్తాయి. ఇంకా వివిధ పాఠశాలలు ICSE, CBSE బోర్దులకు అనుబంధంగా ఉన్నాయి.
బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి.
బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్