Histopathology image classification: Highlighting the gap between manual analysis and AI automation
విషయ సూచిక
స్వరూపం
1787 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1784 1785 1786 - 1787 - 1788 1789 1790 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- జూన్ 27 : ఈ రోజు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరుకు ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831లో కలెక్టరుకి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను), ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది.
- ఆగష్టు 6 : అమెరికా రాజ్యాంగ ప్రతి తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, అమెరికా రాజ్యాంగ సభ సమావేశానికి అందించారు.
- సెప్టెంబర్ 17 - ఫిలడెల్ఫియాలోని స్వాతంత్ర్య మందిరంలో అమెరికా రాజ్యాంగ సూత్రాలపై చర్చ పూర్తయింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అమెరికా రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆ రోజు నిర్ణయం పొందినవే.[1]
జననాలు
మరణాలు
- మే 10 : విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715)